
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఆర్ఆర్ఆర్ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈఏడాది భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ముఖ్యంగా చరణ్, తారక్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా పులులతో కలిసి బ్రిటిష్ వారిపై ఎన్టీఆర్ దాడి చేసే సన్నివేశంకు విదేశీయులు ఫిదా అయ్యారు.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. జక్కన దర్శకత్వం.. చరణ్, తారక్ నటన అద్భుతమంటూ పొగిడారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, నక్కలతో కలిసి తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీకి విదేశీయులు ఫిదా అయ్యారు.
Rrr 1
ఈ ఒక్క సీన్‌ను ఓ విదేశీయుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. కేవలం 48 గంటల్లో 11 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. “నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు” తారక్ వైల్డ్ ఎంట్రీ చూసి థియేటర్లలో ప్రేక్షకులు నోరెళ్లపెట్టారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటిగా నలిచింది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు.