
Tarak Wife Lakshmi Pranati: మహేష్ బాబు (Mahesh Babu)భార్య నమ్రత, రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన, అల్లు అర్జున్ (Allu Arjun)భార్య స్నేహ ఇలా చాలా మంది యంగ్ స్టార్ హీరోలు భార్యలు తమ భర్త కు , ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ.. సందడి చేస్తారు. అయితే ఈ లిస్టు లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చేరింది. తాజాగా ప్రణతి సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. బాలనటుడు నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తారక్ ఓ పేరు కాదు .. ఒక బ్రాండ్ అనేంతగా ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్ చేయనున్నవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఇటువంటి సమయంలో తారక్ భార్య లక్ష్మి ప్రణతి ట్విటర్లో అడుగుపెట్టింది.
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఇప్పటివరకు పెద్దగా బయటికి వచ్చింది లేదు. పెళ్లయిన కొత్తలో ఎన్టీఆర్‌తో కలిసి తన సినిమాల ఫంక్షన్లలో సందడి చేసింది. ఇక ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత ఫ్యామిలీతో ఫుల్ టైం గడపడం తోపాటు.. కరోనా సమయంలో ఎటువంటి ఫంక్షన్లు లేకపోవడం తో గత కొన్నేళ్లుగా ప్రణతి బయట కనిపించడం లేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోస్‌లో మాత్రమే కనిపిస్తుంటుంది. అయితే ప్రణతి తాజాగా ట్విటర్లో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. మొదటి పోస్ట్ గా తన భర్త ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు ‘మీ అందరితో కలిసి ట్విటర్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను’ అంటూ ప్రణతి తన భర్త ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్లో అడుగుపెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లక్ష్మి ప్రణతి ట్విటర్లో అడుగుపెట్టిన గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.