Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?

Bimbisara Movie Update: నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'బింబిసార'. సీనియర్ ఎన్టీఆర్ జయంతి రోజున

Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. బింబిసార కోసం యంగ్ టైగర్ వాయిస్ ?
Bimbisara

Updated on: Jun 09, 2021 | 6:42 AM

Bimbisara Movie Update: నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బింబిసార’. సీనియర్ ఎన్టీఆర్ జయంతి రోజున బింబిసారగా అందరినీ ఆశ్చర్యపర్చాడు కళ్యాణ్ రామ్. క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దపు మగధ సామ్రాజ్య చక్రవర్తి బింబిసార కథను తెరకెక్కిస్తున్నాడు.. కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో కళ్యాణ్ రామ్ స్టైల్.. బాహుబలిని పోలి ఉండటంతో పాటు.. ఇదో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే స్టోరీ అని చెప్పడంతో.. ఆడియన్స్ లో ఎక్కడా లేని క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బింబిసార సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కీలకమైన కథను పరిచయం చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు.. టాక్ వినిపిస్తోంది. ఇలా బింబిసారలో జూనియర్ తనవంతు పాత్ర పోషించనున్నాడని చెబుతున్నారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ కష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు సాయం చేశాడు. సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ బ్యానర్ నష్టాల్లో ఉన్నప్పుడు.. ఆ బ్యానర్ లో జూనియర్ మూవీస్ కూడా చేశాడు. ఇక ముందు తాను చేయబోయే చిత్రాలన్నింటిలో ఎన్టీఆర్ బ్యానర్ ను భాగస్వామ్యం చేస్తానని ఇటీవలే ప్రకటించాడు. దీంతో బింబిసారను ఎన్టీఆర్ కూడా సీరియస్ గానే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Also Read: Samantha Akkineni: యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌కి బెట‌ర్ ఆప్ష‌న్‌గా స‌మంత‌.. ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్

నేను చేస్తున్న సేవని వెనక ఉండి నడిపిస్తుంది వాళ్లే..!సోను సూద్ ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ టీవీ 9 లో లైవ్ వీడియో.:Sonu Sood video.

Samantha Family Man2: స‌మంత యాక్ష‌న్స్ సీన్స్ ఎలా చేసిందో చూశారా.? బ‌డా హీరోలు సైతం బ‌లాదూర్‌..

RRR Movie: మెగానందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఎదురు చూడాలట..!