
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది నటి జాన్వీ కపూర్. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తనదైన నటన, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే, జాన్వీ హీరోయిన్ కావడం ఆమె తల్లి శ్రీదేవికి మొదట్లో అంతగా ఇష్టం లేదనే వార్త మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కజిన్, నటి మహేశ్వరి ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన తల్లి శ్రీదేవి హీరోయిన్ కావాలన్న నిర్ణయంపై మొదట్లో ఎలాంటి అభిప్రాయంతో ఉండేవారో వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముందుగా మహేశ్వరి మాట్లాడుతూ..
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనుకున్నంత సులభం కాదని శ్రీదేవి భావించేవారని గుర్తు చేసుకున్నారు. కేవలం అందం, నటన ఉంటే సరిపోదని.. పరిశ్రమలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఎంతో ధైర్యం, అంకితభావం అవసరమని శ్రీదేవి చెప్పేవారట. తన కూతురు ఈ ఒత్తిళ్లను తట్టుకోగలదా లేదా అని శ్రీదేవి తీవ్రంగా ఆలోచించేవారని మహేశ్వరి తెలిపారు. ఇక ఇదే విషయం పై జాన్వీ కపూర్ స్పందిస్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. “నేను హీరోయిన్ అవ్వగలను అనే నమ్మకం నా తల్లికి మొదట్లో లేదు. ముఖ్యంగా నాకు ముక్కు సర్జరీ జరగకముందు వరకు అమ్మకు( శ్రీదేవికి) నా లుక్స్, కేపాబిలిటీపై పూర్తి నమ్మకం కుదరలేదు. కానీ, ఆ సర్జరీ పూర్తయ్యాక నా మేక్‌ఓవర్ చూసి, నాలో హీరోయిన్ అయ్యే అర్హత ఉందని అమ్మ భావించింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి అంగీకరించింది” అని జాన్వీ తెలిపింది.
సాధారణంగా స్టార్ కిడ్స్‌కు ఇండస్ట్రీ ఎంట్రీ చాలా సులభమని అనుకుంటారు. కానీ, శ్రీదేవి వంటి లెజెండరీ నటి కూడా తన కుమార్తె విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఎలాంటి ఆలోచనలు చేశారో జాన్వీ మాటల ద్వారా అర్ధమవుతుంది. శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్ కూడా తన కుమార్తె సినీ భవిష్యత్తు విషయంలో ఇంతగా ఆలోచించారా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి