Jabardasth Emmanuel: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట.. యూత్ తెగ చూస్తున్నారు

జబర్దస్త్ షోలో ఆకట్టుకుని బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న మొదటి సినిమా డెస్టినీ. బిగ్ బాస్ బ్యూటీ సత్యశ్రీ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Jabardasth Emmanuel: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట.. యూత్ తెగ చూస్తున్నారు
Jabardasth Emmanuel

Updated on: Oct 30, 2026 | 6:37 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. గతేడాదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు ఇమ్మూ. విజేతగా నిలవకపోయినా తన దైన ఆట తీరు, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ఇప్పటికే బుల్లితెరపై స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన ఇమ్మూ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ప్రజెంట్ ట్రెండ్ అయిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో ఓ పిట్టకథ, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పేరు డెస్టినీ. బిగ్ బాస్ బ్యూటీ సత్యశ్రీ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా డెస్టినీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇద్దరి గుండెలపైనా’ అంటూ లిరిక్స్ తో సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, సత్యశ్రీల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబడుతోన్న ఈ పాటకు శ్రీరామ్ తపస్వి సాహిత్యం అందించారు. మారుతీ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల లయబద్ధంగా ఆలపించారు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ రూపొందించిన సింపుల్ స్టెప్పులు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఇక ‘డెస్టినీ’ సినిమా విషయానికి వస్తే.. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తన్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్నిఅప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

డెస్టినీ సినిమా రొమాంటిక్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us