Jabardasth: ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా: జబర్దస్త్ కమెడియన్

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jabardasth: ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా: జబర్దస్త్ కమెడియన్
Jabadasth

Updated on: Sep 03, 2026 | 11:14 AM

జబర్దస్త్ కామెడీ వల్ల చాలా మంది క్రేజ్ తెచ్చుకున్నారు .. కొంతమంది కమెడియన్స్ గా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా హీరోలు, డైరెక్టర్లు కూడా అయ్యారు. కానీ జబర్దస్త్ వేదిక పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయమైన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది తిరిగి వచ్చి జబర్దస్త్ చేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో లేదా ఇతర షోల్లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది కమెడియన్స్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు.  తాజాగా జబర్దస్త్ షోలోకి ఓ క్రేజీ కమెడియన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాదు .. ఎదో పొగరుగా బయటకు వెళ్ళా కానీ రూమ్ రెంట్ కూడా కట్టలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చాడు.. ఇంతకూ ఆ కమెడియన్ ఎవరో కాదు..

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు

చలాకీ చంటి.. ఎస్.. తన కామెడీతో, పంచ్ లతో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించాడు చంటి. జబర్దస్త్ వేదికపై ఎన్నో స్కిట్స్ చేసి నవ్వులు పూయించిన చంటి ఆ తర్వాత ఊహించని విధంగా ఆ షో నుంచి బయటకు వెళ్ళాడు.. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో ఆయన మీద రకరకాల రూమర్స్ వచ్చాయి. వాటన్నింటినీ చంటి ఖండించాడు. అలాగే పలు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొన్నాడు చంటి.

ఇవి కూడా చదవండి

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

తాజాగా జబర్దస్త్ లో అలరించిన కమెడియన్స్ అందరూ రీ ఎంట్రీ ఇచ్చారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇలా చాలా మంది వచ్చారు.  చంటి కూడా జబర్దస్త్ స్టేజ్ మీద మరోసారి సందడి చేశాడు.. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో   రూమ్ రెంట్ కట్టడానికి కూడా కష్టంగా ఉంది, ఎదో పొగరుతో బయటకు వెళ్ళాం కానీ బయట పరిస్థితులు బాలేవు అంటూ తనదైన స్టైల్ లో పంచ్ వేసి నవ్వులు పూయించాడు చంటి. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us