Jabardasth: జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్.. ఒక్కో ఎపిసోడ్‌కు నాగబాబు, ఇంద్రజలు ఎంత తీసుకుంటారో తెలుసా?

జబర్దస్త్ టీవీ షోకు టీమ్ లీడర్స్, కమెడియన్లు ఎంత పేరు తెచ్చారో జడ్జెస్ కూడా అంతకన్నా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు, ఇంద్రజలు ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మరి వారి రెమ్యునరేషన్ ఎంత? ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటారు?

Jabardasth: జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్.. ఒక్కో ఎపిసోడ్‌కు నాగబాబు, ఇంద్రజలు ఎంత తీసుకుంటారో తెలుసా?
Jabardasth, Indraja, Nagababu

Updated on: Oct 13, 2026 | 4:55 PM

2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుమారు 13 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను నవ్విస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కామెడీ షోకు ఆదరణ తగ్గినా ఇప్పటికీ చాలా మంది జబర్దస్త్ ను క్రమం తప్పకుండా చూస్తున్నారు. టీవీల్లో చూడకపోయినా యూట్యూబ్ లో ఈ కామెడీ స్కిట్లను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ లో కమెడియన్లు ఎలాగైతో ఆకట్టుకుంటున్నారో జడ్జెస్ కూడా తమదైన తీర్పుతో మెప్పిస్తున్నారు. 2013లో జబర్దస్త్ ప్రారంభమైనప్పుడు నాగబాబు, రోజాలు జడ్జెస్ గా వ్యవహరించారు. చాలా ఏళ్ల పాటు వీరిద్దరే ఈ షోను నడిపించారు. జబర్దస్త్ కు మంచి టీఆర్పీ రేటింగులు రావడంలో నాగబాబు, రోజాల పాత్ర కూడా చాలా ఉంది. అయితే కాలక్రమేణా ఈ షోలో చాలా మార్పులు వచ్చాయి. స్టార్ కమెడియన్లతో పాటు నాగబాబు, రోజాలు కూడా వివిధ కారణాలతో ఈ షోకు దూరమయ్యారు. వీరి ప్లేస్ లో చాలా మంది జడ్జెస్ గా వచ్చారు. ఖుష్బూ, సంఘవి, మనో, కృష్ణ భగవాన్.. ఇలా జబర్దస్త్ కు చాలా మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మళ్లీ నాగబాబు తిరిగి రావడంతో జబర్దస్త్ కు పూర్వ వైభవం తిరిగి వచ్చిందంటున్నారు. అలాగే రోజా స్థానంలో ఇంద్రజ కూడా పర్మినెంట్ గా సెటిలైపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ దైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రెమ్యునరేషన్ ఎంతన్నది ఆసక్తికరంగా మారింది.

హీరోగా, నటుడిగా, నిర్మాతగా, సహాయక నటునిగా మెప్పించిన నాగబాబు ఇప్పుడు రాజకీయాలతోనూ బిజీగా ఉంటున్నారు. ఆ మధ్యన జబర్దస్త్ కు షోకు దూరమైన ఈ మెగా బ్రదర్ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాగబాబు పాపులారిటీ, మార్కెట్, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు సుమారుగా ఒక్కో ఎపిసోడ్ కి రూ.5నుండి 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఈ లెక్కన చూస్తే నెలకు సుమారుగా 20 లక్షల ఆదాయం జబర్దస్త్ నుంచే సంపాదిస్తున్నారు నాగబాబు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ. ఇప్పుడు కూడా సహాయక నటిగా మెప్పిస్తోందీ అందాల తార. మొదట శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా చేసిన ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ లో కూడా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఇంద్రజ ఒక్కొక్క ఎపిసోడ్ కి సుమారుగా రూ.2.5లక్షలు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం . ఈ లెక్కన జబర్దస్త్ నుంచి నెలకు సుమారు రూ.10 లక్షల ఆదాయం ఇంద్రజ కు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us