Anasuya: ‘పుష్ప’ సెట్‏లోకి అనసూయ… ‘మంచి రోజులు ముందున్నాయి’ అంటూ ట్వీట్..

|

Apr 22, 2021 | 8:08 AM

Pushpa Movie Update: బుల్లితెరపై యాంకర్‏గా చేస్తూనే.. అటూ వెండితెరపై తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది

Anasuya: పుష్ప సెట్‏లోకి అనసూయ... మంచి రోజులు ముందున్నాయి అంటూ ట్వీట్..
Anasuya
Follow us on

Pushpa Movie Update: బుల్లితెరపై యాంకర్‏గా చేస్తూనే.. అటూ వెండితెరపై తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది జబర్ధస్థ్ బ్యూటీ అనసూయ. అప్పటివరకు టెలివిజన్ యాంకర్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత అక్కినేని ప్రధాన పాత్రలలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. తాజాగా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోంటుంది అనసూయ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

మంచి రోజులు ముందున్నాయి. మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. దేవీశ్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం అనసూయ రవితేజ ‘ఖిలాడి’, కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన ‘థ్యాంక్యూ…బ్రదర్‌’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ట్వీట్…

Also Read: SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..