Jabardasth: తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్‌! గ్రాండ్‌గా జోర్దార్ సుజాత సీమంతం! ఫొటోస్ వైరల్

|

Apr 06, 2024 | 6:12 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత జోడీ ఒకటి. ఈ వేదికపై ఒకరికొకరు పంచులు, సైటైర్లు వేసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ జంట నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు. ఇదే జబర్దస్త్ వేదికపైనే రాకేష్- సుజాత తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్డ్స్.

Jabardasth: తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్‌! గ్రాండ్‌గా జోర్దార్ సుజాత సీమంతం! ఫొటోస్ వైరల్
Jordar Sujatha
Follow us on

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత జోడీ ఒకటి. ఈ వేదికపై ఒకరికొకరు పంచులు, సైటైర్లు వేసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ జంట నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు. ఇదే జబర్దస్త్ వేదికపైనే రాకేష్- సుజాత తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్డ్స్. పెళ్లయ్యాక జబర్దస్త్ స్కిట్ల ద్వారా ఆడియెన్స్ ను అలరిస్తున్నారీ బ్యూటిఫుల్ కపుల్. ఇదిలా ఉంటే జోర్దార్ ఈ మధ్యన సుజాత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ షేర్ చేసినా ‘మీరు ప్రెగ్నెంటా’? అని కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సుజాత వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ తాజాగా సుజాత సీమంతం జరి​గిందంటూ ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో సుజాత.. పర్పుల్‌ కలర్‌ చీరలో నగలు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ ఫొటోను మరో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను సతీమణి ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘ హ్యాపీ ఫర్‌ యూ.. కంగ్రాచ్యులేషన్స్‌’ దీనికి క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం జోర్దార్ సుజాత సీమంతం ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు రాకింగ్ రాకేష్ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంపై అటు రాకేష్ కానీ, సుజాత కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఓవైపు జబర్దస్త్ తో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూనే.. మరోవైపు సినిమాలు, సిరీస్ లతో అలరిస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సేవ్ ది టైగర్స్ సీజన్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

జోర్దార్ సుజాతతో గెటప్ శీను సతీమణి..

హోలీ వేడుకల్లో రాకింగ్ రాకేష్ – సుజాత దంపతులు..

చంటబ్బాయి వీడియోలో జోర్దార్ సుజాత దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.