Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో

ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్ ఇటీవల ఒకే రూమ్ లో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.

Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో
Hyper Aadi

Updated on: Aug 26, 2026 | 2:13 PM

ఫోక్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్నారు. జంటగా కలిసి ఎన్నో ఫోక్ సాంగ్స్ చేసిన వీరిద్దరు ఒకే గదిలో కనిపించడం, సరిగ్గా ఇదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు సార్లు స్పందించాడు ఈశ్వర్ సాయి. తానెందుకు మాధురి గదిలో ఉండాల్సిందో వివరణ ఇస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేశాడు. అటు మాధురి రాథోడ్ కూడా తన వివరణ ఇచ్చుకుంది. కానీ వీరిపై నెట్టింట ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. అదే సమయంలో చాలా మంది ఈశ్వర్ సాయి భార్యను కూడా తప్పుపడుతున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా ఒక అమ్మాయి గురించి నిందలు వేయడం తప్పు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఇదే వ్యవహారంపై జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా స్పందించాడు. తన తోటి జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ తో కలిసి ఒక వీడియోను చేసి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు ఆది. అందులో ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ల వ్యవహారంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడీ స్టార్ కమెడియన్.

‘ఒకరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. అందులోనూ అమ్మాయిల గురించి తెలియకుండా ఏదీ మాట్లాడకూడదు. ఇటీవల ఒకరి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఫోక్ డాన్సర్ మాధురి గురించి వస్తున్న వార్తలు నన్ను బాధ పెడుతున్నాయి . వాళ్ల పర్సనల్ విషయాలని బయట పెట్టడం తప్పు. వారు ఎన్నో ఏళ్లుగా కలిసి రీల్స్, పాటలు చేస్తున్నారు. వాళ్లిద్దరూ ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయ్యారన్నది పక్కన పెడితే.. తెలిసో తెలియకో చేసిన పొరపాటును వీడియో తీసి పబ్లిక్ చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఈశ్వర్ సాయికి అయితే పెళ్లయింది.. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అలాంటి అమ్మాయి పరువును ఇప్పుడు బయటకీడ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అవుతుందా? ఆ అమ్మాయే కాదు ఎవరి గురించి కూడా వేరొకరు తప్పుగా మాట్లాడకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు గురించి తెలియకుండా ఏది అనకూడదు’ అని ఆది చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా హైపర్ ఆదికి సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

హైపర్ ఆది వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us