Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు.. ఒక్క ఛాన్స్ అంటూ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన ప్రతిభను నిరూపించుకుంటూ ఇప్పుడు నటుడిగా తనదైన ముద్రవేసాడు. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. అయితే కేవలం నటనలోనే కాదు.. చదువులోనూ హైపర్ ఆది టాప్ ర్యాంకరే..

Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే..
Hyper Aadi

Updated on: Jul 16, 2026 | 3:30 PM

హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఓవైపు బుల్లితెరపై హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా పలు షోలలో అలరిస్తున్నాడు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆది.. ఆ త్రవాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తన కామెడీ పంచ్ డైలాగ్స్ తో నవ్వులు పంచుతున్నాడు. ఓవైపు టీవీ షోలలోనే కాకుండా అటు సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్టుగా మారాడు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చి.. సినిమా అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఆది.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఆది అటు చదువులోనూ టాపరే. ముఖ్యంగా పదవ తరగతిలో అతడు తెచ్చుకున్న మార్క్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. పది, ఇంటర్, బీటెక్ లో మంచి మార్కులు సాధించి సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన ఆది.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం శ్రీదేవి డ్రామా కాంపెనీలో హైపర్ ఆది పదవ తరగతి మార్క్స్ లిస్ట్ బయటపెట్టింది యాంకర్ రష్మి. అందులో ఆది మార్క్స్ చూసి షాకయ్యింది ఇంద్రజ. పదవ తరగతిలో మొత్తం 534 మార్కులు సాధించాడు ఆది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో 85 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో 87, మ్యాథ్స్‌లో 96, సైన్స్‌లో 94, సోషల్‌లో 92, హిందీలో 80 మార్కులు వచ్చినట్లు రష్మి చదివి వినిపించింది. పల్లామల్లి అనే చిన్న గ్రామంలో సెవెన్త్ క్లాస్ స్కూల్ టాప్ అని అడిగితే హైపర్ ఆది అని చెబుతారని.. ఇప్పుడు తన పేరు హైపర్ ఆది అని.. కానీ అప్పుడు తన పేరు కోట ఆదయ్య అని చెప్పుకొచ్చాడు ఆది. ఇప్పటికీ బోర్డ్ మీద తన పేరు ఉంటుందని.. టెన్త్ క్లాసులో ఒక అమ్మాయికి తనకంటే 7 మార్కులు ఎక్కువ వచ్చాయని చెప్పాడు ఆది.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

కేవలం టెన్త్ క్లాసులోనే కాదు.. ఇంటర్, బీటెక్ లోనూ మంచి మార్కులే వచ్చాయట. ఇంటలో తనకు 1000కి 945 మార్క్స్ వచ్చాయని.. కేవలం తనకు ఇంగ్లీష్ లోనే మార్క్స్ తగ్గాయని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడూ కామెడీ పంచులతో అలరించే ఆది టెన్త్, ఇంటర్ లో టాప్ ర్యాంక్ స్టూడెంట్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

హైపర్ ఆది మార్క్స్ లిస్ట్..

Hyper Aadi Marks

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us