
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబు ఇప్పుడు డైరెక్టర్ గా మారిపోయాడు. అతను తెరకెక్కించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బాబు, ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచున్నారు. ఇదే క్రమంలో తన ప్రేమ కథను కూడా బయటపెట్టాడు. తనకు కాబోయే భార్య పేరు అమూల్య అంటూ తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని అందరితో పంచుకున్నాడు. ‘ అమూల్య ప్రస్తుతం ఓ లోకల్ టీవీ ఛానెల్ గా యాంకర్ గా పనిచేస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు టిక్‌టాక్‌లో అమూల్య వీడియోలు చేసేది. వాటిని చూసే ఆమెపై మనసు పారేసుకున్నారు. అప్పటికే ఆమెకు సోషల్ మీడియాలో ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండేవారు. ఆమె వీడియోలకు లైక్స్ కొడుతూ, కామెంట్స్, మెసేజ్‌లు చేసి వాడిని. కానీ ఆమె పట్టించుకోలేదు. ఒకసారి హైదరాబాద్‌లో అనుకోకుండా ఎదురుపడినా మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కాస్త పాపులర్ అయ్యాక ఎలాగోలా ఆమె నంబర్ సంపాదించి కాల్ చేశాను. అయితే అప్పుడు కూడా నేను నచ్చకపోవడంతో ఏకంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది’
‘లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరోసారి ఆమెకు ఫోన్ చేశాను. ఈసారి ఆమె సోదరుడు ఫోన్ఓ లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లగా అమూల్యతో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పటికీ ఆమె కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడటంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వీలు కుదిరినప్పుడు కలుసుకునేవాళ్లం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అమూల్య అండగా నిలిచింది. నా దగ్గర చిల్లిగవ్వ లేని రోజుల్లో ఆమె ఎన్నోసార్లు ఆర్థికంగా సాయం చేసింది. మంచి క్వాలిటీతో రీల్స్ చేసుకోవడానికి, ఫొటోలు తీసుకోవడానికి నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని భావించి తన ఐదు నెలల జీతం దాచిపెట్టి మరీ ఓ ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇచ్చింది. నేను వద్దని వారించినా తను వినలేదు. జబర్దస్త్‌లో నేను ఎదగడానికి, దర్శకుడిగా మారడంలో అమూల్య ప్రోత్సాహం ఎంతో ఉంది. కనీసం ఒక్క సినిమా అయినా చేసి, స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనేది మా ఇద్దరి నిర్ణయం. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఇరు కుటుంబాల పెద్దలు మా ప్రేమను అంగీకరించారు. త్వరలోనే వివాహ తేదీని అధికారికంగా ప్రకటిస్తాను ‘ అని జబర్దస్త్ బాబు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. తోటి జబర్దస్త్ ఆర్టిస్టులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.