BiggBoss 10: మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు! ఆ నటుడి కోసం నెటిజన్స్ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ‘ అగ్ని పరీక్ష సీజన్ 2’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

BiggBoss 10: మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు! ఆ నటుడి కోసం నెటిజన్స్ కామెంట్స్
Bigg Boss 10 Telugu

Updated on: Sep 03, 2026 | 8:27 AM

బిగ్  బాస్ సీజన్ 10 సిద్ధమైపోయింది.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ గేమ్ షో మొదలుకానుంది. దాంతో ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ఈసారి కూడా కమానర్స్ గట్టిగానే సందడి చేయనున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కొందరిని సెలక్ట్ చేసి వారిని ఫిల్టర్ చేశారు. వారితో పాటు సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే సామాన్యులకు పోటీ ఇచేలా ఈసారి క్రేజ్ ఉన్న క్యాండెట్స్ ను రంగంలోకి దింపనున్న బిగ్ బాస్ టీమ్. వారిలో ఓ టాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడని తెలుస్తుంది. అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న నువ్వు హౌస్ లోకి అదరగొట్టు మా ఓట్లన్నీ నీకే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా.?

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

ఒకప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తనకంటూ ,మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. హ్యాపీడేస్ సినిమా ద్వారా కృష్ణుడు క్రేజ్ తెచ్చుకున్నాడు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు,  వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించాడు కృష్ణుడు. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోనూ చిన్న హీరో ఫ్రెండ్ గా కనిపించాడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ

అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్ అనే సినిమాలో చివరిసారిగా నటించాడు కృష్ణుడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది. తాజాగా కృష్ణుడు సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో కింద నెటిజన్స్, అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓట్లు మేము వేస్తాం.. మీరు హౌస్ లో దైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో నువ్వు మరో శివాజీ అవ్వాలి అన్న నువ్వు, బిగ్ బాస్ తో మంచి కమ్ బ్యాక్ ఇవ్వు అన్న అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us