టాలీవుడ్ లో రాణిస్తున్న యంగ్ బ్యూటీస్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు కృతిశెట్టి. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మంగుళూరు బ్యూటీ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా పోస్టర్ చూడగానే కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోయింది చిన్నది. అయితే ఈ ఈఏడాది ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదు. వరుసగా ఫ్లాప్ లు పలకరించాయి . నితిన్ తో చేసిన మాచర్లను నియోజక వర్గం, రామ్ వారియర్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఓ బంపర్ ఆఫర్ కు నో చెప్పిందని తెలుస్తోంది.
కృతి శెట్టికి ఇటీవలే తమిళ్ నుంచి ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో కృతిశెట్టికి ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. బాల దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే ఈ చిన్నదానికి బాలీవుడ్ నుంచి కూడా ఓ ఆఫర్ వచ్చిందట.
బాలీవుడ్ లో ‘అందాదూన్’ సినిమా తీసిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ త్వరలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారట. అయితే ఈ మూవీ షూటింగ్ కు ఓకే కూడా చేసింది. అయితే ముందుగా ముంబై కి వచ్చి ఆడిషన్ ఇవ్వమని అన్నారట చిత్రయూనిట్. కొత్త హీరోయిన్ మాదిరిగా ఆడిషన్ అనేసరికి కృతి ఆ ఆఫర్ వదులుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.