Peddi Movie: ఒకరు కాదు ఇద్దరు.. ‘పెద్ది’ సినిమాలో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'పెద్ది'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Peddi Movie: ఒకరు కాదు ఇద్దరు.. పెద్ది సినిమాలో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Peddi Movie

Updated on: May 14, 2026 | 11:23 AM

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న పెద్దిలో రామ్ చరణ్ క్రికెటర్ గానూ, కుస్తీ యోధుడిగానూ రెండు పాత్రల్లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ , సాంగ్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న ఈ మూవీ జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది చిత్ర బృందం.

కాగా పెద్ది సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గౌర్ నాయుడు అనే పవన్ ఫుల్ రోల్ లో ఆయన కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్ లో శివన్న రోల్ కు సంబంధించి ఎలాంటి కంటెంట్ రివీల్ చేయలేదు కానీ ఆయన ఇందులో రామ్ చరణ్ గురువుగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం శివన్న ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట వేరే హీరోలను అనుకున్నారట. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, తమిళ హీరో విక్రమ్ లతో గౌర్ నాయుడు రోల్ చేయించాలనుకున్నారట మేకర్స్. అయితే అప్పటికే వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండడంతో శివన్నను సంప్రదించారట. ఆయన కథ, తన పాత్ర విని వెంటనే ఒకే చేశారట. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న శివరాజ్ కుమార్ ఈ పాత్ర చేయడంతో పెద్దికి చాలా ప్లస్ అయ్యిందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్ది సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

హోంబలే ఫిల్మ్స్ చేతికి పెద్ది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us