
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. కొంతమంది నటీమణు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు తెలిపారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది లైంగికంగా వేధిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో ఎదురైనా చేదు అనుభవాల గురించి బయట పెట్టారు. తాజాగా ఓ ఇన్ స్టా మోడల్ టాలీవుడ్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ దర్శకుడు తనకు సినిమా ఆఫర్ ఇచ్చాడని.. కానీ ఆతర్వాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ ఇన్ స్టా మోడల్ ఎవరో తెలుసా.?
సోషల్ మీడియాలో చాలా మంది ముద్దుగుమ్మలు తమ రీల్స్, వీడియోలతో పాపులర్ అవుతూ ఉంటారు. వారిలో మౌనీషా చౌదరి ఒకరు. ఈ అమ్మడు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. అలాగే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియా బ్యూటీ మౌనీషా చౌదరి టాలీవుడ్‌లోని ఓ స్టార్ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ డైరెక్టర్ తనకు సినిమా ఆఫర్ ఇచ్చి, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తన తొడల సైజ్ గురించి అడిగాడని చెప్పుకొచ్చింది. ఆమె ఆ సమయంలో ఆ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ, ఆ డైరెక్టర్ ఇప్పుడు పెద్ద స్టార్స్‌తో పెద్ద సినిమాలు తీస్తున్నాడని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి చర్చను రేకెత్తించాయి. ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు ఆమె..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.