Mangalavaram: ఘనంగా మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఐకాన్ స్టార్

|

Nov 11, 2023 | 6:33 PM

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి సినిమాతో అజయ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక పాయల్ రాజ్ పుత్ తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ ముద్దుగుమ్మ. పాయల్ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసినప్పటికీ పాయల్ కు ఆర్ఎక్స్ 100 అంత క్రేజ్ రాలేదు.

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి సినిమాతో అజయ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక పాయల్ రాజ్ పుత్ తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ ముద్దుగుమ్మ. పాయల్ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసినప్పటికీ పాయల్ కు ఆర్ఎక్స్ 100 అంత క్రేజ్ రాలేదు. దాంతో ఇప్పుడు పాయల్ ఆశలన్నీ మంగళవారం సినిమా పైనే పెట్టుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ పప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ రీవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నారు. మంగళవారం సినిమా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.