Prabhas: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా.. ఎంతో తెలిస్తే దిమ్మతురుగుద్ది

|

Aug 01, 2021 | 10:53 AM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌‌‌‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Prabhas: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా.. ఎంతో తెలిస్తే దిమ్మతురుగుద్ది
Prabhas
Follow us on

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీసినిమాల్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌‌‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే, అలాగే కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌‌‌ను ఇటీవలే ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ ఈ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. బాహుబలి ఫార్మాట్‌‌‌లో జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను  నిర్మిస్తున్నారు నిర్మాతలు. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో  ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత – పృథ్వీరాజ్ కుమారన్ కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి ఇది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. వీటితోపాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..