Tollywood: అమ్మడి కాలిపై ఉన్న టాటూ వెనుక ఇంత మీనింగ్ ఉందా..?

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. ఆరడుగులు హైట్‌తో యూత్‌ను తెగ అట్రాక్ట్ చేసే ఈ భామ.. తన సీక్రెట్ టాటూ వెనకున్న కథను చెప్పుకొచ్చింది. తన కాలిపై ఉన్న టాటూ గురించి అభిమానులతో పంచుకుంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాాం..

Tollywood: అమ్మడి కాలిపై ఉన్న టాటూ వెనుక ఇంత మీనింగ్ ఉందా..?
Actress
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:29 PM

“జాతిరత్నాలు” సినిమాతో తెలుగునాట మంచి పాపులారిటీ తెచ్చుకుంది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. అయితే ఆ తర్వాత తెలుగులో చేసిన.. రావణాసుర”, “లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్” అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.  తమిళంలో చేసిన “వల్లి మయిల్” సినిమా కూడా అక్కడ అనుకున్న గుర్తింపు ఇవ్వలేదు. ఇకపోతే..  బంగార్రాజు సినిమాలో కూడా “వాసివాడి తస్సాదియ్యా” పాటకు అక్కినేని హీరోలు నాగ్, నాగచైతన్యతో కలిసి సూపర్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టింది. ఇక అందాల ప్రదర్శనకు కూడా రెడీ అని.. ఇటీవల సోషల్ మీడియా ఫోటోల ద్వారా సంకేతాలు పంపుతుంది.  ఇండస్ట్రీకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పనిచేసింది ఈ అమ్మడు.

ప్రస్తుతం అల్లరి నరేశ్​తో కలిసి ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో హీరోయిన్​గా నటిస్తుంది ఫిరియా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ ఆమె కాలిపై ఉన్న టాటూకు గల రీజన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటని ప్రశ్నించారు. దీనికి ఈ బ్యూటీ క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది. ఫరియా ఎడమ కాలిపై ఉన్న టాటూని  అబర్వ్ చేస్తే, ఎర్రటి వేర్ల గీతలు, దానిపై నీలి రంగులో వృత్తం ఉంటుంది.

“ప్రతి ఒక్కరికీ తమ కెరీర్‌లో ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అనుకున్న స్థాయికి వెళ్లాలంటే.. మన రూట్స్ ఎంత బలంగా  ఉండటం ప్రధానం. ప్రత్యేకించి ఇలా పబ్లిక్ లైఫ్‌లో గడిపేవాళ్లు ఇది బాగా మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం. అంతేకాదు ఎంత ఎదిగినా మనం వచ్చిన స్థాయిని మర్చిపోకూడదు. అందరూ నన్ను నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకునేందుకే ఈ టాటూ వేయించుకున్నాను. అంతేకానీ, మరో స్పెషాలిటీ ఏం లేదు” అని క్లియర్‌గా చెప్పేసింది ఫరియా.

కాగా ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా మే 3న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్’ అనే కాన్సెప్ట్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను మల్లి అంకం డైరెక్ట్ చేయగా, రాజీవ్ చిలక పొడ్యూస్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేశ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్  కామెడీ రోల్​లో కనిపించనున్నారని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?