అతని కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా..! స్నేహితుల మధ్య బాండింగ్ కాదు.. మా బంధం అంతకుమించింది

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు .

అతని కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా..! స్నేహితుల మధ్య బాండింగ్ కాదు.. మా బంధం అంతకుమించింది
Vijay Deverakonda

Updated on: Aug 31, 2026 | 6:00 AM

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “రోమాంచకం” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

ఈ ఈవెంట్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – సందీప్ పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. అది ఒక దర్శకుడు, హీరో మధ్య ఉన్న బంధం కాదు, ఒక బ్రదర్స్ మధ్య ఉన్న బంధం కాదు, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు. మా బంధం అంతకుమించింది. అర్జున్ రెడ్డి టైమ్ లో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకుంటే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. మాకు అప్పుడు డబ్బు లేదు, పేరు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. పెళ్లిచూపులు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి అభిమానులైన మీరు కూడా మా వెనక లేరు. జస్ట్ మేము ధైర్యంగా అడుగేశాం. అర్జున్ రెడ్డి సినిమా లేకుంటే ఆ సక్సెస్ మాత్రమే కాదు సందీప్ తో షేర్ చేసుకున్న ఎన్నో ఎక్సిపీరియన్స్ లు, మూవ్ మెంట్స్ మిస్ అయ్యేవాడిని. జీవితం గురించి మాట్లాడుకున్న ఎన్నో సందర్భాలు మిస్ అయ్యేవాడిని. డబ్బు లేనప్పుడు సందీప్ వాళ్ల బ్రదర్ ప్రణయ్, ఫాదర్ తో పొలం అమ్మించి నాతో నా మీద నమ్మకంతో అర్జున్ రెడ్డి సినిమా చేశాడు . వాళ్ల ఫ్యామిలీ సంపాదన మొత్తం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేశాడు అన్నారు.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా, నాకోసం సందీప్ ఎక్కడిదాకా అయినా వస్తాడు. ఆయన పిలిచాక నేను ఈ ఫంక్షన్ కు రాకుంటే నేను బతికి ఎందుకు. సుమంత్ ను చూసినప్పుడు ఆయన కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్ కనిపించింది. అప్పుడే అనుకున్న సుమంత్ ప్రభాస్ ఏదో ఒక రోజు యాక్టర్ లేదా డైరెక్టర్ అవుతాడు. అప్పుడు మనం చేయగలిగినంత ఇతనికి చేయాలని. మేమ్ ఫేమస్ సినిమాకు నా వంతు ప్రమోషన్ చేశా. భద్రకాళీ లోగో పడుతుంటే అర్జున్ రెడ్డి సౌండ్ వినిపిస్తుంటుంది. సందీప్ అన్న ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సందీప్, ప్రణయ్ తో పాటు ఈ కొత్త టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వాసుకి కంపోజ్ చేసిన రాధారమణ పాట ఆనంద్ కు చాలా ఇష్టం. రోజూ వింటుంటాడు. సెప్టెంబర్ 2న ప్రీమియర్స్ తోనే ఈ సినిమా ఘన విజయం సాధించాలి. సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేశాం అనేది ముఖ్యం. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, మనలో విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుందని విజయ్ అన్నారు

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us