Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈడీ అధికారుల ముందుకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..
Thanish

Updated on: Sep 17, 2021 | 7:42 AM

Tollywood Drugs Case: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈడీ అధికారుల ముందుకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా, నందు, ముమైత్ ఖాన్ ఉన్నారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంక్వైరీ తుది అంకానికి చేరుకుంది. సమన్లు అందుకున్న 12మందిలోహీరో తనీష్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ హీరో తనీశ్‌ను విచారించబోతోంది ఈడీ. విచారణకు వచ్చే సమయంలో బ్యాంక్ అకౌంట్‌లను వెంట తీసుకురావాలని సమన్లు‌లో పేర్కొన్నారు ఈడీ అధికారులు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలు, డ్రగ్ డీల్స్‌లో ఆయన పాత్రపైనా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. తనీశ్ బ్యాంక్ ఖాతాల వివరాలు, లావాదేవీల వివరాలను ఈడీ తీసుకోనుంది. గతంలోనూ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు తనీశ్. అయితే 2017లోనే కేసు ముగిసినా.. మళ్లీ నోటీసులు ఇవ్వడం ఆవేదన కలిగించిందన్నారు తనీశ్. డ్రగ్స్‌లో పట్టుబడిన కెల్విన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారాయన.

ఇప్పటికే రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కెల్విన్‌తో తనీష్‌కు గతంలో పరిచయం ఉందా..? ఎప్పుడు కలిశారు..?  అలాగే డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారించ‌నున్నారు. తనీష్‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు పరిశీలించనున్నారు. అలాగే, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు, అత‌డితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీయనున్నారు అధికారులు. ఇకఈ నెల 22న చివరగా తరుణ్ ను ప్రశ్నించబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood: సోనూసూద్ పై ఇన్‌కం టాక్స్ దాడులు.. ఐదు వేల రూపాయలతో ముంబాయి వచ్చిన మెస్సియా ప్రస్తుత ఆస్తులు ఎంతో తెలుసా?

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..

Bigg Boss 5 Telugu: అయ్యో.. బిగ్‏బాస్ ఇలా అడ్డంగా బుక్కయ్యాడేంటీ.. ఆడుకుంటున్న నెటిజన్స్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us