Roshan Meka : ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టిన కుర్ర హీరో.. బడా బ్యానర్‌లో బంపర్ ఆఫర్ అందుకున్న రోషన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు.

Roshan Meka : ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టిన కుర్ర హీరో.. బడా బ్యానర్‌లో బంపర్ ఆఫర్ అందుకున్న రోషన్..
Roshan

Updated on: Mar 14, 2022 | 9:20 PM

Roshan Meka : సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు.ఆ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రుద్ర‌మ‌దేవిలో చాళ‌క్య వీర‌భ‌ద్రుడి చిన్న‌నాటి పాత్ర‌లో మెరిశాడు. హీరోగా ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన సాలిడ్ సక్సెస్ లేని రోష‌న్ ఈ సారి ఎలాగైనా బ్రేక్ తెచ్చుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా పెళ్లిసందడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా తన మూడో సినిమాను మొదలు పెట్టాడు రోషన్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. రోషన్ బ్యాక్ పోజ్ లో కనిపిస్తాడు. ఈ పోస్టర్ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచింది. ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను రెడీ చేసాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us