Nani: ది ప్యారడైజ్ ఎఫెక్ట్.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన నాని

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపొంందిన ది ప్యారడైజ్‌ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nani: ది ప్యారడైజ్ ఎఫెక్ట్.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన నాని
Nani

Updated on: Oct 07, 2026 | 1:09 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా మెప్పించలేకపోవడంతో ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా అదిరిపోయింది అంటుంటే మరికొంతమంది మాత్రం సినిమా అంతగా లేదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఫలితం ప్రభావం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టులపై పడిందంటూ సోషల్ మీడియాలో రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే సమయంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కాల్సిన సినిమా కూడా ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా ఈ రూమర్స్‌పై హీరో నాని స్పందించాడు. ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. సినిమా రిజల్ట్, శ్రీకాంత్ ఓదెల టాలెంట్, అలాగే చిరంజీవి ప్రాజెక్ట్  పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ది ప్యారడైజ్ అండర్‌ఫెర్ఫార్మ్ కావడానికి కొన్ని లాజిస్టికల్ సమస్యలు కూడా కారణమయ్యాయని నాని తెలిపాడు.

సినిమాను ఇంకా మెరుగ్గా తెరకెక్కించే అవకాశం ఉందని నాని అన్నాడు. అయితే సినిమా ఫలితాన్ని పక్కన పెడితే శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌పై తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. శ్రీకాంత్ దగ్గర చాలా బలమైన ఆలోచనలు ఉన్నాయని, అతడి ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని నాని చెప్పాడు. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ మరింత బలంగా తిరిగి వస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నాని.

‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను నాని తన నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ది ప్యారడైజ్ రిజల్ట్ నేపథ్యంలో చిరంజీవి ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై నాని స్పందిస్తూ.. ది ప్యారడైజ్ ఆలస్యం కావడం వల్ల చిరంజీవి తన ఇతర ప్రాజెక్టులు, కమిట్‌మెంట్స్‌తో ముందుకు వెళ్లారని తెలిపాడు. సినిమా ఆగిపోయిందని మాత్రం తాను చెప్పలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ తర్వాత తాను చిరంజీవిని కలవలేదని, ఇద్దరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వస్తుందని నాని అన్నాడు. దీంతో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తిగా ఆగిపోయిందనే ప్రచారానికి నాని వ్యాఖ్యలు చెక్ పెట్టినట్టయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us