Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుష్ అయ్యే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేస్తుందట…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుష్ అయ్యే న్యూస్.. హరిహర వీరమల్లు టీజర్ వచ్చేస్తుందట...

Updated on: May 23, 2021 | 11:08 PM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట.

హరహర వీరమల్లు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే  వార్త చక్కర్లు కొట్టింది. ఈ విషయంపై ఇటీవల నిర్మాత ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. ” క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. ‘హరిహర వీరమల్లు’ విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

jagame thandhiram: “నీతో.. ప్రేమలోన పడిపోయా…” అంటున్న ధనుష్.. ‘జగమేతంత్రం’ మూవీ నుంచి అందమైన పాట…

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ – 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..