
Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. నటనలో, హావభావాల్లో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి పాత్రైనా ఇట్టే ఒదిగిపోతారు తారక్. నటనతో , హై ఓల్టేజ్ డాన్స్ లతో , అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అశేషాప్రేక్షకాదరణ పొందారు తారక్. నేడు ఈ యంగ్ టైగర్ పుట్టిన రోజు. తారక్ సినిమాలంటే అభిమానుల్లో సందడే .. అదే ఆయన పుట్టిన రోజు అంటే పండగే. తారక్ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. భారీ కటౌట్స్ , పాలాభిషేకాలు, పూలాభిషేకాలు.. ఆ హంగామా మాములుగా ఉండదు. ప్రస్తుతం తారక్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆరఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమానుంచి ఎన్టీఆర్ టీజర్ ను విడుదల చేసారు రాజమౌళి. ఆ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది.
తాజాగా నేడు యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కొమురం భీమ్ గెటప్ లో తారక్ ను చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. గురి చూసి బల్లెం విసురుతున్న కొమురం భీమ్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈ పోస్టర్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా తోపాటు కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడు తారక్.
మరిన్ని ఇక్కడ చదవండి :