Childhood Photo: చిన్నతనంలోనే హార్మోని పై సరిగమలు పలికిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెలు స్థానం  సంపాదించుకుంది.

Childhood Photo: చిన్నతనంలోనే హార్మోని పై సరిగమలు పలికిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood

Updated on: Dec 06, 2022 | 7:24 PM

సినిమా తరాల ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే తమ అభిమాన హీరోయిన్ పేరుతో ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయడమే కాదు వాళ్ల ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తొలిసారి చూడగానే ఇంతముద్దుగా ఉందేంటి.? అనేశారు కుర్రకారు. ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఎవరో కాదు.

పై ఫోటోలు ఉన్న బుజ్జాయి మారెవరో కాదు.. అందాల భామ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్వేతా బసు ప్రసాద్. మొదటి సినిమాతోనే నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

తెలుగు కొన్ని సినిమాల్లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత హిందీ లో సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు హార్మోని వాయిస్తున్న చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది వెబ్ సిరీస్లు, కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

Shweta Basu Prasad

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us