Tollywood: ఏంటి ఈ టాలీవుడ్ హీరోయిన్ మన హైదరాబాద్‌ స్కూల్లోనే చదువుకుందా? ఎవరో గుర్తు పట్టారా?

ఈ టాలీవుడ్ హీరోయిన్ హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. ఇక్కడి భారతీయ విద్యా భవన్, మెరిడియన్ పాఠశాలల్లోనే స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా హైదరాబాదులోనే ఉన్న లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ఓ డైరెక్టర్ ఆమెను చూసి హీరోయిన్ గా తీసుకున్నాడు.

Tollywood: ఏంటి ఈ టాలీవుడ్  హీరోయిన్ మన హైదరాబాద్‌ స్కూల్లోనే చదువుకుందా? ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: May 11, 2026 | 6:47 PM

పై ఫొటోలో స్కూల్ ప్లకార్డు పట్టుకుని పోజులిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ అనలేం కానీ అందం, అభినయం పరంగా ఉన్నంతలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుఉంటోంది. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈ క్యూటీకి చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఆసక్తి. ముఖ్యంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ లోనే పలు డ్యాన్స్ కాంపీటీషన్లలో పాల్గొని సత్తా చాటంది. దీంతో డ్యాన్స్ పట్ల ఆమెకు ఉన్న మక్కువను చూసి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని షియామక్ దావర్ డ్యాన్సింగ్ స్కూల్ లో చేర్పించారు. అక్కడ కథక్, హిప్ హాప్, వాకింగ్, బెల్లీ డ్యాన్స్ తదితర వాటిల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇక సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసిందీ అందాల తార. ముఖ్యంగా థియేటర్ ఆర్టిస్టుగా 50 కి పైగా తెలుగు భాషా నాటక నిర్మాణాలలో భాగమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీలో గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మహానటి, కల్కి సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ బ్యూటీని చూశాడట. ఆ వెంటనే తన సినిమా ఆడిషన్ కు పిలిచారట. అక్కడ తన యాక్టింగ్ ట్యాలెంట్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి వెంటనే తన సినిమలో హీరోయిన్ గా తీసుకున్నారట..

మర ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి. మొదట సినిమాతోనే మంచి సాలిడ్ హిట్ అందుకుంది ఫరియా. జాతి రత్నాలు సినిమాలో ఫరియా నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, బంగర్రాజు, రావణాసుర తదిర సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సందడి చేసిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అలాగే లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో కథానాయికగా చేసింది ఫరియా. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ సత్యతో కలిసి ఆమె నటించి మత్తు వదలరా 2 సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో కామెడీ తోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఫరియా. గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒకరాజు రీసెంట్ గా గాయపడ్డ సింహం సినిమాల్లో నటించిందీ అందాల తారు. ఇక బుల్లితెరపై కూడా కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వల్లి మెయిల్ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోందీ ఫరియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us