Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి..

పేరుకు తెలుగు అమ్మాయే అయినా బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిందీ అందాల తార. హాలీవుడ్ మూవీస్ లోనూ యాక్ట్ చేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ క్రేజీ హీరోయిన్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కూచిపుడి, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి..
Tollywood Actress

Updated on: May 31, 2025 | 1:14 PM

పై ఫొటోలో తండ్రి పక్కన కూర్చొన్న క్యూట్ పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెనాలీలో పుట్టి విశాఖ పట్నంలో పెరిగింది. 16 ఏళ్లకే ముంబై కు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించింది. అయితే కాలేజీకి వెళుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంపై ఆసక్తి పెంచుకుంది. పలు అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఫెమినా మిస్ ఇండియా లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో విజేతగా నిలిచింది. ఇదే క్రమంలో హీరోయిన్ గా సినిమాఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ హాలీవుడ్ సినిమాలోనూ మెరిసింది. అయితే హీరోయిన్ గా సినిమా కెరీర్ పీక్స్ గా ఉన్న సమయంలోనే ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందీ అందాల తార. ఇరు పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కింది. పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టేసే ఉంటారు చాలా మంది. తను మరెవరో కాదు అక్కినేని నాగ చైతన్య సతీమని, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఈరోజు (మే 31) పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో శోభితకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

గతేడాది డిసెంబర్ లో అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఆమె మంకీ మ్యాన్ అనే సినిమాలో నటించిందీ అందాల తార. అలాగే లవ్ సితార అనే బాలీవుడ్ మూవీలోనూ నటించింది. అయితే వీటి తర్వాత కొత్త సినిమాను ప్రకటించ లేదీ అందాల తార. ఆ మధ్యన ఏదో షూటింగుల్లో పాల్గొందని కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మరోవైపు నాగ చైతన్య మాత్రం పెళ్లి తర్వాత తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ తో ఓ సినిమా (NC 24) చేస్తున్నాడు

ఇవి కూడా చదవండి

శోభిత ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల