Tollywood: చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు తెలుగులో ఫేమస్ హీరోలు.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న కుటుంబం నుంచే ఈ అన్నదమ్ములు కూడా వచ్చారు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ స్టోరీలు, సబ్జెక్టులతో ఎంచుకుంటూ టాలీవుడ్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారీ క్రేజీ బ్రదర్స్.

Tollywood: చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు తెలుగులో ఫేమస్ హీరోలు.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actors

Updated on: Apr 07, 2026 | 6:14 PM

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోన్న అన్నదమ్ములు చాలా మందే ఉన్నారు. నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి, మంచు, దేవరకొండ ఫ్యామిలీస్ తో సహా చాలా మంది అన్నదమ్ములు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్నది కూడా అన్నదమ్ములే. వీరు ఓ స్టార్ ప్రొడ్యూసర్ కుమారులు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయులుగా పేరు సొంతం చేసుకున్నారు. వీరిలో ఒకరు ఇప్పుడు టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. మంచి ఒడ్డు, పొడుగు ఉండడంతో యాక్షన్ సినిమాలతో హిట్స్ కొడుతున్నాడు. ఇక ఇతని సోదరుడు ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వీరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఈ ఇద్దరిలో ఒకరు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. గత ఆదివారమే అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. దీంతో ఈ హీరో చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అదే. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్. బెల్లంకొండ సురేష్ వారసులైన వీరు ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. కిష్కింధపురితో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అతని చేతిలో ఇప్పుడు టైసన్ నాయుడు, హైంధవ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ హీరో ఇప్పుడు త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. కావ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు. గత ఆదివారం వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ వీడియో..


ఇక బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తొలి ప్రేమ దర్శకుడు కరుణాకరన్ తో ఓ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాబోయే భార్యతో బెల్లంకొండ శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us