Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు..పేరు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే.. గుర్తు పట్టారా?

పై ఫొటోలో కాలు మీద కాలేసుకుని ఠీవిగా కూర్చొన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎంతలా అంటే ఎక్కడైనా హీరో పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేంతలా. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న ఇతనికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది

Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు..పేరు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Follow us

|

Updated on: Jun 26, 2024 | 7:58 PM

పై ఫొటోలో కాలు మీద కాలేసుకుని ఠీవిగా కూర్చొన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎంతలా అంటే ఎక్కడైనా హీరో పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేంతలా. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న ఇతనికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అదేదో సినిమాలో చెప్పినట్లు మార్కెట్ లో ఈ హీరో క్రేజ్ చూస్తే మెంటలెక్కిపొద్ది అన్న డైలాగ్ ఈ స్టార్ హీరోకు సరిపోద్ది. పెద నాన్న వారసత్వంతో అడుగుపెట్టిన ఈ ఆరడుగుల హీరో మళ్లీ గురువారం(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో. దీంతో ఎప్పుడెప్పుడు ఈ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు మరికొన్ని గంటల్లో కల్కి సినిమాతో మనల్ని పలకరించనున్న పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.ఇది అతని చిన్న నాటి ఫొటో.

కల్కి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్, కమల్ హాసన్, మాళవిక నాయర్, దిశ పటానీ వంటి స్టారాది స్టార్లు ఈ మూవీలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గురువారం (జూన్ 27) న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కల్కి థియేటర్లలోకి వచ్చాక మరెన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.