సలార్ లో తన పాత్ర పై శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

Rajeev 

28 June 2024

ప్రభాస్ సలార్  గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసిన సలార్‌ లో శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించింది.

అయితే ఈ సినిమాలో శృతి పాత్ర పెద్దగా కనిపించదు. దాంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

శృతి హాసన్ వంటి పెద్ద హీరోయిన్‌ ఇలాంటి ప్రాధాన్యత లేని గెస్ట్‌ రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది అంటున్నారు

తాజాగా సలార్ లో తన పాత్ర గురించి స్పందించింది. సలార్‌ లో తన పాత్ర చిన్నదే అంటూ ఒప్పుకుంటూనే..

సలార్‌ వంటి సినిమాను నేను ఎందుకు వదులుకుంటాను అంటూ ప్రశ్నించింది శృతి హాసన్

సలార్‌ లో నా పాత్ర తక్కువ అని నేను భావించడం లేదు. గతంలో నేను ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్ సినిమాలు చేశా ..

కానీ ఆ  సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. చిన్న చిన్న రోల్స్ చేసిన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి అని చెప్పుకొచ్చింది.