Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్

Vijay Devarakondas Liger: ఛాయ్ వాలా టు బాక్సర్... అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్
Liger

Updated on: Dec 31, 2021 | 10:20 AM

Liger: విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరీజగన్నాథ్ తనదైన మార్క్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఇదిలా ఉంటే వరుస అప్డేట్స్ తో లైగర్ టీమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

తాజాగా లైగర్ నుంచి గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఛాయ్ వాలా టు బాక్సర్.. ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడన్నది చూపించారు. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను ఆయన పాత్రే మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదల కోసం విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అటు విజయ్.. ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ప్రస్తుతం లైగర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.  ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

Loading...
Unable to load recommendations.
Follow Us