Gen Z: ట్రెండ్ మారింది.. జెన్‌జీలు ఎక్కువగా చూసే సినిమాలు ఇవే..

అసలు జెన్ జీలు ఇష్టపడే సినిమాల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం. జెన్ జిలు ఎక్కుగా ఇష్టపడిన టాప్ 5 సౌత్ సినిమాల పై ఓ లుక్కేద్దాం.!  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోని కొన్ని కథలు జెన్ జెడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కనెక్ట్ అవుతున్నాయి.

Gen Z: ట్రెండ్ మారింది.. జెన్‌జీలు ఎక్కువగా చూసే సినిమాలు ఇవే..
Gen Z

Updated on: Aug 10, 2026 | 6:38 PM

ప్రస్తుతం జెన్‌జీ హవా నడుస్తుంది. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది. ప్రస్తుతం ఉన్న జెన్‌జీల అభిరుచులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలా అని పిల్ల తనంగా కాదు.. చాలా పెద్దరికంగా, దూరదృష్టితో ఉంటారు. వారి ఆలోచనలు , వారి విజన్ చాల డిఫరెంట్ గా ఉంటుంది. జెన్ జిలు ప్రతి విషయంలోనూ చాలా లోతుగా పరిశీలిస్తుంటారు. అలాగే సినిమాల విషయంలో కూడా.. జెన్ జిలకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో తెలుసా.? ఒకప్పుడు సినిమా అంటే హీరో, హీరోయిన్, పాటలు, ఫైట్లు, కామెడీ ఇవే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా జెన్ జీ (Gen Z) ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం పూర్తిగా భిన్నంగా మారింది. కథలో కొత్తదనం ఉందా.? పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయా.? డైలాగ్స్, మ్యూజిక్, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయా.? అనే విషయాలను కూడా ఈ తరం ప్రేక్షకులు ఎక్కువగా గమనిస్తున్నారు.

ప్రేమకథల్లో కొత్తదనం

జెన్ జీకు నచ్చే సినిమాల్లో ప్రేమకథలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాత తరహాలో హీరో హీరోయిన్‌ను వెంటపడటం, కొన్ని అపార్థాలు, చివర్లో కలుసుకోవడం అనే ఫార్ములా కంటే… ఇప్పటి స్టైల్ ప్రేమకథలు,  సంబంధాలు, ప్రేమలోని కన్ఫ్యూజన్, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, బ్రేకప్‌లు వంటి అంశాలను చూపించే కథలను జెన్ జీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మొన్నామధ్య విడుదలైన మలయాళ సినిమా ‘ప్రేమలు జెన్‌జీలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అలాగే ‘96’, ‘సీతారామం’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలు కూడా ప్రేమ, జ్ఞాపకాలు, స్నేహం, జీవితంలో తీసుకునే నిర్ణయాలను అందంగా చూపించాయి.

ఇవి కూడా చదవండి

హీరో అంటే సూపర్‌హీరోనే కావాల్సిన అవసరం లేదు.. జెన్ జీలు ఎక్కువాగా తప్పులు చేసే హీరో, ఓటమిని ఎదుర్కొనే వ్యక్తి, కెరీర్ విషయంలో అయోమయంలో ఉండే యువకుడు, ప్రేమలో విఫలమయ్యే వ్యక్తి… ఇలా సాధారణ మనుషుల్లాంటి పాత్రలు జెన్ జీ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి.

స్నేహానికి పెద్దపీట

జీవితంలో ఫ్రెండ్ షిప్ కి  ప్రాధాన్యం సినిమాలు కూడా జెన్ జీలు ఎక్కుగా ఇష్టపడుతుంటారు. ఈలిస్ట్ లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ ముందు వరసలో ఉంటుంది. అలాగే రియలిస్టిక్ కథలకు కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. జెన్ జీ ప్రేక్షకులు తమ చుట్టూ కనిపించే జీవితాన్ని సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు. కాలేజీ, ఉద్యోగం, ప్రేమ, కుటుంబ సమస్యలు, డబ్బు, కెరీర్, ఒంటరితనం, ఫ్రెండ్ షిప్, మెంటల్ ప్రజర్ ఇలాంటి అంశాలు కథలో కనిపిస్తే ప్రేక్షకులు తమ జీవితంతో పోల్చుకుంటారు. ఇలాంటి సినిమాలను జెన్ జీలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us