Ananya Panday: ‘లైగర్’ హీరోయిన్‌కు చేదు అనుభవం.. నడుముపై చేతులు వేసి అసభ్యకరంగా.. వీడియో వైరల్

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనన్య పాండే తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ పబ్లిక్ ఈవెంట్ లో చేదు అనుభవం ఎదురైంది.

Ananya Panday: లైగర్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. నడుముపై చేతులు వేసి అసభ్యకరంగా.. వీడియో వైరల్
Ananya Panday

Updated on: Jul 19, 2026 | 1:43 PM

ఈ మధ్యన సినిమా హీరోయిన్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పబ్లిక్ ఈవెంట్స్ లో
కొంతమంది వల్ల వారికి తరచూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ హీరోయిన్లను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్‌ రష్మిక భుజాలపై బాలీవుడ్‌ హీరో చేతులు వేయడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్‌ అయింది. ఇక మొన్నటికి మొన్న ధురంధర్ సింగర్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా ‘లైగర్’ హీరోయిన్ అనన్యా పాండేకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యన సినిమాలతో పాటు ఫ్యాషన్ ఈవెంట్లకు కూడా హాజరవుతోంది అనన్య. అలా తాజాగా ఆమె ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నిర్వహించిన ఫ్యాషన్‌ షోకి హాజరైంది. అక్కడ ర్యాంప్ వాక్ చేసి షో స్టార్ గా నిలిచింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఫ్యాషన్ షో ముగిసిన తర్వాత గౌరవ్‌ గుప్తాతో కలిసి వేదికపైకి వచ్చి ఫొటోలకు పోజులిచ్చింది అనన్య. అయితే, ఈ సమయంలో అతను ఆ హీరోయిన్ తో కాస్త చనువుగా ప్రవర్తించాడు. అనన్య నడుముపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతను అలా చేసే సరికి అనన్య కూడా తీవ్ర అసౌకర్యానికి గురైంది. అయితే స్టేజ్ పై ఉండంతో నవ్వుతూనే పక్కకు తప్పుకొని గౌరవ్‌ కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

అనన్య పాండేకు సంబంధించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. డిజైనర్ గౌరవ్‌ గుప్తా వ్యవహరించిన తీరుని తప్పుపడుతూ చాలా మంది నెటిజన్లు అనన్యకు మద్దతుగా కామెంట్స్‌ పెడుతున్నారు. అదే సమయంలో మరికొంతమంది మాత్రం గౌరవ్ కు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. గౌరవ్‌ సరదాగా అలా చేశాడని.. అనన్యతో అతనికి మంచి స్నేహబంధం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us