Gaana of Republic: ఆకట్టుకుంటున్న గానా ఆఫ్ రిపబ్లిక్ .. మరోసారి మెస్మరైజ్ చేసిన మణిశర్మ

| Edited By: Rajeev Rayala

Jul 10, 2021 | 9:03 PM

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల కథలవిషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అయిన తేజ్ చిత్రలహరి సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.

Gaana of Republic: ఆకట్టుకుంటున్న గానా ఆఫ్ రిపబ్లిక్ .. మరోసారి మెస్మరైజ్ చేసిన మణిశర్మ
Sai Tej
Follow us on

Republic: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల కథలవిషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అయిన తేజ్ చిత్రలహరి సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ మెగా హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రిపబ్లిక్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

గేయ రచయిత రెహమాన్ అందమైన లిరిక్స్ రాశారు. ఈ యూత్ ఫుల్ సాంగ్ ని యువ గాయకులు అనురాగ్ కులకర్ణి – ధనుంజయ్ – హైమత్ మహ్మద్ – ఆదిత్య అయ్యంగర్ – పృథ్వీ చంద్ర కలసి ఆలపించారు. హేయ్ రారో.. హేయ్ రారో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. నా మౌనం పాడే గానం.. నా ప్రశ్న సమాధానం’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balamevvadu: సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులే టార్గెట్‌గా బలమెవ్వడు.. ఆకట్టుకుంటోన్న టీజర్‌.

Allu Family: వెండతెర ఎంట్రీ ఇవ్వనున్న అల్లు వారసురాలు.. లాంచ్‌ చేయనున్న స్టార్‌ ప్రొడ్యుసర్‌.?

Heroine With Mehandi: చేతిలో గొరింటాకు వేసుకొని.. అటుగా తిరిగి ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా.?