ఫేమ్‌ను క్యాష్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న ఇన్‌ప్లూయెన్సర్స్..

మురికిపట్టిన హాస్యానికి, పనికిమాలిన క్రియేటివిటీ కొంత జోడించి ఉన్నతమైన తండ్రీకూతుర్ల బంధాన్ని వికృతంగా చూపించిన ఒక సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గుర్తున్నాడా? రెండేళ్ల కిందట లైమ్‌లైట్‌లోకొచ్చింది ఇతగాడి విపరీతబుద్ధి. ప్రతీ తండ్రీ వాడిమీద ఉమ్మేసి, బహిష్కరించినంత పనిచేశాడు. కనీసం అతడి పేరు పలకడానిక్కూడా వెగటు పుట్టేది అప్పట్లో మనందరికీ. నెటిజనం అంతా ఒక్కటై సోషల్ మీడియాలో ఇటువంటి పోకడల్ని ఖండఖండాలుగా నరికేసింది. వదిపెట్టం, ఇటువంటివాళ్లను వేటాడతాం ఏరివేస్తాం అని ప్రభుత్వాలు కూడా కంకణం కట్టుకున్నాయి. దురదృష్టం ఏంటంటే, అతగాడు ఇప్పటికీ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా చెలామణీ ఔతున్నాడు. కోర్టులు స్యుమోటో కేసులు రాస్తున్నయ్, బోనులోకి ఈడుస్తున్నయ్. కానీ, మన చట్టాలు సరిపోకనో, మరో కారణం చేతనో అటువంటి సోషల్ మీడియా సెలబ్రిటీల అతి మళ్లీమళ్లీ మితిమీరుతోంది. సైబర్ ఫ్రాడ్స్‌ని మించి జరుగుతోంది సెలబ్రిటీలు కాని ఈ సెలబ్రిటీల అరాచకత్వం. కొందరు వావీ వరసల్ని వదిలేస్తున్నారు. మరికొందరు పైసల కోసం కక్కుర్తి పడి, తమ ఫాలోయింగ్‌నే పెట్టుబడిగా చేసుకుని, కంత్రీ బిజినెస్ షురూ చేస్తున్నారు.

ఫేమ్‌ను క్యాష్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న ఇన్‌ప్లూయెన్సర్స్..
Influencer Scams

Updated on: Jun 08, 2026 | 9:40 PM

పెద్ద స్కామ్‌ని బైటపెట్టడం కాదు, పెద్ద స్కామ్‌కి సూత్రధారులు వీళ్లే అని లోకం కోడైకూస్తోంది. వారంపదిరోజులుగా అన్ని మీడియాల్లోకీ దూరి, హల్‌చల్ చేస్తున్న ఈ సోకాల్డ్ పాపులర్ ఫిగర్లు ఎంతోమంది.. చూడ్డానికి సో ఇన్నోసెంట్స్ అనిస్తారు. వారిది క్రేజీ ఫ్యామిలీ కాదు, ఖతర్నాక్ ఫ్యామిలీ అని ఆ తర్వాతే కదా తెలిసింది?.. నందూస్ వరల్డ్… ఇప్పుడు లండన్‌ టు ఏపీ ఇబ్రహీంపట్నం, తెలంగాణ మాదాపూర్‌ దాకా సెన్సేషన్ ఔతోంది. మూడేళ్ల కిందటే మన ఇండియన్సే టార్గెట్‌గా COS పేరుతో భారీ వీసా స్కామ్ చేసినట్లు వీళ్లమీద తీవ్రమైన ఆరోపణలు. రెండేళ్ల కిందట సీఐడీలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. తియ్యగా మాటలు చెప్పి, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం, ఫేక్ స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టడం… ఇదీ నందూ స్కామ్ మోడస్ ఆపరాండీ. బాధితులు ఒక్కొక్కరుగా బైటికొచ్చి ఈ క్రేజీ కపుల్ పాల్పడే క్రేజీ స్కామ్‌ గురించి చెప్పుకుని గొల్లుమంటున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ అడ్డంగా దొరికిపోయిన దొంగలు. కేసులు, లుకౌట్‌ నోటీసుల దాకా చేరిపోయింది వ్యవహారం. ఇండియాతో పోలిస్తే, బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. నేరం రుజువైతే యూకేలో ఉన్నపళంగా పాస్‌పోర్ట్‌లు రద్దైపోతాయ్. కనీసం పదేళ్ల జైలుశిక్ష పక్కా అని అక్కడున్న...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి