Tamannaah Bhatia: ఫ్లాపుల్లో ఉన్న తమన్నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?

ఒక హీరోయిన్ కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు సహజం. కానీ తమన్నా గ్రాఫ్ చూస్తే ఆమె ప్రతి ఐదేళ్లకు ఒకసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తోంది. టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ భామ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ..

Tamannaah Bhatia: ఫ్లాపుల్లో ఉన్న తమన్నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
Tamannaah2

Updated on: Dec 21, 2025 | 6:30 AM

ఒక హీరోయిన్ కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు సహజం. కానీ తమన్నా గ్రాఫ్ చూస్తే ఆమె ప్రతి ఐదేళ్లకు ఒకసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తోంది. టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ భామ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన టాప్-5 టర్నింగ్ పాయింట్స్ ఇవే.

1. హ్యాపీ డేస్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమన్నా తలరాతను మార్చేసింది. ఇందులో ‘మధు’ అనే కాలేజీ అమ్మాయి పాత్రలో ఆమె పలికించిన హావభావాలు అప్పట్లో ఒక ట్రెండ్. ఈ సినిమాతోనే ఆమెకు ‘మిల్కీ బ్యూటీ’ అనే పేరు స్థిరపడిపోయింది. యువతలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ రావడానికి ఇదే పునాది.

2. ఆవారా

తమిళ చిత్రం ‘పైయా’కు తెలుగు వెర్షన్ గా వచ్చిన ‘ఆవారా’ తమన్నా కెరీర్లో ఒక మ్యాజిక్ అని చెప్పాలి. కార్తీ సరసన ఆమె నటించిన ఈ రోడ్ ట్రిప్ మూవీ యూత్ కు పిచ్చెక్కించింది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతం, అందులోని ‘చిరు చిరు చిరు నవ్వు’ పాటలో తమన్నా గ్లామర్ ఒక సంచలనం. ఈ సినిమాతో ఆమె తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని తమన్నా లుక్ ఆమె అభిమానులకు ఫేవరెట్.

3. రచ్చ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన తమన్నా నటించిన ‘రచ్చ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమె మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా ‘వాన వాన వెల్లువాయే’ రీమిక్స్ సాంగ్‌లో తమన్నా చేసిన డ్యాన్స్, చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. కమర్షియల్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని ఈ సినిమాతో నిరూపించుకుంది తమన్నా.

Happy Days To Jailer

4. బాహుబలి

తమన్నా కెరీర్ లో అత్యంత కష్టపడిన పాత్ర ఏదైనా ఉందంటే అది ‘అవంతిక’నే. ఒక అడవి బిడ్డగా, యోధురాలిగా ఆమె చేసిన యుద్ధ విద్యలు, ప్రభాస్‌తో సాగే రొమాంటిక్ సీన్లు ఆమెలోని కొత్త నటిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ సినిమా తర్వాతే ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గ్లామర్ మాత్రమే కాదు, పవర్ ఫుల్ యాక్షన్ కూడా చేయగలనని ప్రూవ్​ చేసుకుంది.

5. జైలర్

వయసు పెరుగుతున్నా తన ఎనర్జీ తగ్గలేదని రజనీకాంత్ ‘జైలర్’లో నిరూపించింది. ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఈ పాట సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఆమె హిందీలో వరుస ప్రాజెక్టులతో పాటు ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది.