Tollywood : ఫిల్మ్‌ఫేర్‌లో దుమ్మురేపిన టాలీవుడ్.. ఏ ఏ సినిమాలకు అవార్డ్స్ వచ్చాయంటే..

తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేశారు. మమ్ముట్టి, విక్రమ్, బ్రహ్మానందం, సిద్ధార్థ్, నటి కీర్తి సురేష్ లతో పాటు చాలా మంది నటులు అవార్డు వేడుకలో పాల్గొని ఈవెంట్‌కు మరింత కళ తెచ్చారు.  తెలుగు, తమిళ సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందించారు. ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి. 

Tollywood : ఫిల్మ్‌ఫేర్‌లో దుమ్మురేపిన టాలీవుడ్.. ఏ ఏ సినిమాలకు అవార్డ్స్ వచ్చాయంటే..
Tollywood
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 04, 2024 | 4:58 PM

ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2024 అవార్డుల వేడుక నిన్న (ఆగస్టు 03) బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేశారు. మమ్ముట్టి, విక్రమ్, బ్రహ్మానందం, సిద్ధార్థ్, నటి కీర్తి సురేష్ లతో పాటు చాలా మంది నటులు అవార్డు వేడుకలో పాల్గొని ఈవెంట్‌కు మరింత కళ తెచ్చారు. తెలుగు, తమిళ సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందించారు. ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.

అవార్డు అందుకున్న టాలీవుడ్ సినిమాలు, నటీనటులు ఎవరో ఒక్కసారి చూద్దాం..!

ఉత్తమ చిత్రం: బలగం

ఉత్తమ నటుడు: హీరో నాని (దసరా)

ఉత్తమ నటి: హీరోయిన్ కీర్తి సురేష్ (దసరా)

ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)

ఉత్తమ సినీ విమర్శకుల నామిని : బేబీ

ఉత్తమ నటుడి విమర్శకుల నామిని: ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ)

ఉత్తమ నటుడి విమర్శకుల నామిని: నవీన్ పోలిశెట్టి (మిస్టర్ పొలిశెట్టి మిస్ శెట్టి)

ఉత్తమ నటి విమర్శకుల నామిని: వైష్ణవి చైతన్య (బేబీ)

ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తాండ)

ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేర్ వీరయ్య)

ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మి (బలగం)

ఉత్తమ నూతన దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)

ఉత్తమ నూతన దర్శకుడు: శౌర్యవ్ (హాయ్ నాన్నా)

ఉత్తమ పాటలు: బేబీ (విజయ్ బుల్గానిన్)

ఉత్తమ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (బేబీ)

ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబీ)

ఉత్తమ గాయని: శ్వేతా మోహన్ (సర్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)

ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (దసరా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్య (దసరా)

ఉత్తమ నూతన నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)

తమిళ్ సినిమాల విషయానికొస్తే..

ఉత్తమ చిత్రం: చిత్త

ఉత్తమ నటుడు: చియాన్ విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)

ఉత్తమ నటి: నిమిషా సజయన (చిత్త)

ఉత్తమ దర్శకుడు: అరుణ్ కుమార్ (చిత్త)

ఉత్తమ సినీ విమర్శకుల నామిని: విడుదలై 1

ఉత్తమ నటుడి విమర్శకుల ఎంపిక: సిద్ధార్థ్ (చిత్త)

ఉత్తమ నటి విమర్శకుల నామిని: ఐశ్వర్య రాజేష్ (ఫర్హానా)

విమర్శకుల ఎంపిక ఉత్తమ నటి: అపర్ణా దాస్ (దాదా)

ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాసిల్ (మామన్నన్)

ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)

ఉత్తమ పాటలు: సంతోష్ నారాయణ్ (చిత్త)

ఉత్తమ సాహిత్యం: ఇలంగా కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్)

ఉత్తమ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్)

ఉత్తమ గాయని: కార్తీక విద్యానాథన్ (చిత్త)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిన్ సెల్వన్)

ఉత్తమ కొరియోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.