గేమ్ ఛేంజర్ సినిమాతో ఈ అమ్మడు గేర్ ఛేంజ్ అవుతుందా..
TV9 Telugu
04 August 2024
కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఈ అమ్మడి అసలు పేరు అలియా అద్వానీ.
అయితే మార్చుకోమని సల్మాన్ ఖాన్ కియారాకు సలహా ఇచ్చాడట. దాంతో కియారాగా పేరు మార్చుకుంది ఈ చిన్నది.
కియారా ముంబైలో చదువుకుంది. కియారా అద్వానీకి ‘కబీర్ సింగ్’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
తెలుగులో ఈ అమ్మడు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో పరిచయం అయ్యింది.
బాలీవుడ్‌లో ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార.
సిద్ధార్థ్, కియారా జంటగా నటించిన చిత్రం ‘షేర్షా’. వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఈ సినిమానే కారణం.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత తిరిగి తెలుగులో వరుస అవకాశాలు
అందుకుంటుందో లేదో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి