కేవలం రెండు పాటలు, మూడు సన్నివేశాలే కాదు సినిమాలంటే.: సోనాక్షి సిన్హా

Anil Kumar

04 August 2024

బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హా.. తాజాగా 'కాకుడా' అనే హారర్‌ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఈ అమ్మడు మాట్లాడుతూ తనకు హారర్‌ సినిమాలంటే ఇష్టం ఉండదని., ప్రధాన పాత్రలపై స్పందించారు ఆమె.

కేవలం రెండు పాటలు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే చిత్రాల్లో భాగం కావాలనుకోవడం లేదని అంటున్నారు సోనాక్షి.

అందుకే ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. 'కాకుడా' స్క్రిప్ట్ చదువుతుంటే సరదాగా అనిపించి చేశానని చెప్పారు.

నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేదు. తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను.

కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని విజయవంతం కాలేదు. ఒక ఆర్టిస్ట్‌గా నేను ఆ సినిమాలను కూడా ఆస్వాదించాను అన్నారు.

ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు.. అయితే టీమ్‌లోని కొందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నరు.

అండ్ ఆమె ఇంతకు ముందు సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరమండి: ది డైమండ్ బజార్ అనే సిరీస్ లో నటించింది.