కమల్ హాసన్ నటించిన విక్రమ్(Vikram )సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో పాటు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్ లో స్టార్ హీరో సూర్య కూడా నటించారు. సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక విక్రమ్ సినిమాలో సూర్య చిన్న పాత్రలో కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా సూర్య అభిమానుల అత్యుత్సహానికి థియేటర్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో విక్రమ్ సినిమా ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్ మీద సూర్య కనబడగానే టపాకాయలు పేల్చారు సూర్య అభిమానులు. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి తెరకు అంటుకున్నాయి. దాంతో సినిమా రన్ అవుతుండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. థియేటర్ లో మంటలు ఎగసిపడటం తో ప్రేక్షకులు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభిమానుల అత్యుత్సహానికి థియేటర్ స్క్రీన్ తగలబడిపోయింది.
మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి