గ్రేట్ హీరో.. 200 మంది డాన్సర్లకు వరుణ్​ ఆర్థిక సాయం..

క‌రోనా​ అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమా ఇండ‌స్ట్రీ కూడా చాలా కుదేలైంది. చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో లాక్​డౌన్​ కార‌ణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ డాన్సర్లకు చేదోడు అందిచారు యంగ్ హీరో వరుణ్​ ధావన్​. 200 మంది నృత్య కళాకారులకు కష్టాల నుంచి గ‌ట్టేక్కేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో కొంత నగదును జమ చేశాడు. బాలీవుడ్​ సినిమాల్లో గతంలో డాన్సర్​గా వర్క్ […]

గ్రేట్ హీరో.. 200 మంది డాన్సర్లకు వరుణ్​ ఆర్థిక సాయం..

Updated on: Jul 10, 2020 | 10:37 PM

క‌రోనా​ అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమా ఇండ‌స్ట్రీ కూడా చాలా కుదేలైంది. చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో లాక్​డౌన్​ కార‌ణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ డాన్సర్లకు చేదోడు అందిచారు యంగ్ హీరో వరుణ్​ ధావన్​. 200 మంది నృత్య కళాకారులకు కష్టాల నుంచి గ‌ట్టేక్కేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో కొంత నగదును జమ చేశాడు. బాలీవుడ్​ సినిమాల్లో గతంలో డాన్సర్​గా వర్క్ చేసిన‌ రాజ్​ సురానీ ఈ విషయాన్ని తెలిపారు.

కాగా ఇప్పటికే సిద్ధార్థ్​ మల్హోత్రా, షాహిద్​ కపూర్​లు డాన్సర్లకు ఆర్థిక సాయం అందించారు. కొందరు డ్యాన్స‌ర్స్ ఇంటి రెంట్ కూడా చెల్లించ‌లేక‌పోతున్నార‌ని, వారి కుటుంబసభ్యులకు కావాల్సిన మెడిసిన్​ను కొనేందుకు డ‌బ్బులు లేవ‌ని రాజ్​ సురానీ పేర్కొన్నారు. అలాంటి డాన్సర్లకు సహాయం చేసిన వారందరికీ రుణ‌పడి ఉంటామ‌ని చెప్పారు .హీరో వరుణ్​ ధావన్​ నటించిన ‘కూలీ నెం.1’ రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో వరుణ్ సరసన సారా అలీఖాన్​ క‌థానాయిక‌గా నటించింది. మొద‌ట‌ మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది.