ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

ప్రస్తుతం వారంలో నాలుగైదు చిత్రాలు విడుదలవుతున్నాయి. భారీ బడ్జె్ట్.. భారీ హైప్ మధ్య సినిమాలు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అలాగే చిన్న చిన్న కంటెంట్ చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కానీ ఓ సినిమా దాదాపు ముప్పై ఏళ్ల క్రితం విడుదలై ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది.

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
Movie Song

Updated on: Jan 19, 2026 | 5:10 PM

సినిమాలే కాదు కొన్ని పాటలు కూడా పేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పాటలు మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ గీతాలు ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. అలాగే విరహగీతాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది పాటలు వింటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు. నిజంగా తమ ప్రేమ విఫలైనతంగా బాధపడుతూ ఉంటారు.. అలాంటి పాటల్లో ఈ పాట ఒకటి. ఈ సాంగ్ వింటే ఖచ్చితంగా కన్నీళ్లు రావాల్సిందే.. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సాంగ్ కూడా..

సినిమా విడుదలై కొన్నేళ్లు అవుతున్నా కూడా ఈ పాట పేక్షకుల గుండెల్లో మిగిలిపోయింది. ఆ సాంగ్ మరేదో కాదు గులాబీ సినిమాలోని “ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను”  ఇది ఒక విరహ గీతం.. హీరో నుంచి హీరోయిన్ను విలన్స్ కిడ్నప్ చేసిన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. జేడీ చక్రవర్తి, మహేశ్వరి కలిసి నటించిన సినిమా గులాబీ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..

గులాబీ సినిమాకు శశి ప్రీతమ్ సంగీతం అందించారు. అలాగే ఈ పాటను కూడా ఆయనే ఆలపించారు. అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలోని ప్రతి పదం ప్రేక్షకులను మనసులను కదిలిస్తుంది. ఇక గులాబీ సినిమా విషయానికొస్తే ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 1995లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సినిమా అనే చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..