Cinema: ఇదేం క్రేజ్‌రా బాబూ! ఒక్కో సినిమా టికెట్ ధర రూ. 90 వేలా! నిమిషాల్లో క్లోజ్ అయిపోయిన బుకింగ్స్

ప్రపంచ సినిమా రంగంలో అత్యంత విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సిరీస్ లో మూడో భాగం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

Cinema: ఇదేం క్రేజ్‌రా బాబూ! ఒక్కో సినిమా టికెట్ ధర రూ. 90 వేలా! నిమిషాల్లో క్లోజ్ అయిపోయిన బుకింగ్స్
Dune 3 Movie

Updated on: Apr 08, 2026 | 5:30 PM

సాధారణంగా ఒక సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, కొన్నిసార్లు కేవలం కొన్ని గంటల ముందు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలవుతాయి. కానీ ఇక్కడ ఒక సినిమాకు సంబంధించిన టిక్కెట్లు విడుదలకు ఎనిమిది నెలల ముందే ప్రారంభమయ్యాయి. అది కూడా ఒక్కో టికెట్ రూ.90,000 గా ఉన్నా హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. హాలీవుడ్ లో బాగా విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీలలో డ్యూన్ సిరీస్ కూడా ఒకటి. ఈ ఫ్రాంఛైజీలోని మూడవ భాగం ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ చిత్రం సాంకేతికంగా చాలా ఉన్నతమైనది. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు సుమారు 8 నెలల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఐమాక్స్ థియేటర్లలో మాత్రమే ఈ సినిమా టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆశ్చర్యకరంగా, బుకింగ్‌లు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. డిమాండ్ పెరగడంతో, టిక్కెట్లు కొన్నవారు వాటిని ‘ఈ-బే’ వంటి ప్రైవేట్ వేలం వెబ్‌సైట్లలో తిరిగి వీటిని అమ్మకానికి పెట్టారు. నివేదికల ప్రకారం, ఒక్క టిక్కెట్టు ఏకంగా $999 ( ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.83,000 నుంచి రూ. 90,000 వరకు) ధరకు అమ్ముడైంది. ఇది సినీ ప్రేమికులలో డ్యూన్ 3 పట్ల ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తుంది.

కాగా ఇండియన్ మార్కెట్‌లో ‘డ్యూన్’ సిరీస్‌కు కూడా భారీ డిమాండ్ ఉంది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ పోస్టర్లు, ఎడారి సీన్స్ ‘డ్యూన్’ చిత్రాన్ని పోలి ఉన్నాయన్నకామెంట్స్ వినిపించాయి. దీంతో భారతీయ ప్రేక్షకులలో ఈ హాలీవుడ్ సిరీస్‌పై బాగా ఆసక్తి పెరిగింది . సినిమా మాత్రమే కాకుండా, ఈ సిరీస్‌లోని ‘డ్యూన్: ప్రాఫసీ’ కూడా విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి టబు ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

‘డ్యూన్’ సినిమా మూడవ భాగం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో టిమాటి షలోమేట్, జెండయా, జాసన్ మావోమా తదితర ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డెన్నిస్ వెల్లినియువ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us