Dr Rajasekhar : విభిన్నమైన కథతో రానున్నయాంగ్రీ మ్యాన్ సినిమా.. ఆసక్తి రేపుతున్న టైటిల్..

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ త్వరలో మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గరుడ వేగ, కల్కి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నరు

Dr Rajasekhar : విభిన్నమైన కథతో రానున్నయాంగ్రీ మ్యాన్ సినిమా.. ఆసక్తి రేపుతున్న టైటిల్..
Marmanuvu

Updated on: Mar 26, 2021 | 8:22 AM

Dr Rajasekhar Upcoming Movie : యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ త్వరలో మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గరుడ వేగ, కల్కి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నరు రాజశేఖర్. ‘కేరాఫ్ కంచరపాలెం’ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రాజశేఖర్. ”మర్మాణువు” అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పెగాసస్ సినీ కార్పొరేషన్ ఎల్ఎల్పి – మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ శివాణి – శివాత్మిక – విజయ ప్రవీణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’  చిత్రాలతో వెంకటేష్ మహా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సహజత్వం ఉట్టిపడేలా సినిమాలను తెరకెక్కించే వెంకటేష్ మహా ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నాడని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. దర్శకుడు వెంకటేష్ మహా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఓ పుర్రె బొమ్మకు ఇంద్రజాలికుడు గెటప్ వేసినట్లు ఈ పోస్టర్ ను డిజన్ చేసారు. ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంలీబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ”వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు మంచి టైటిల్ కుదిరింది. కథ కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి.ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Buchi Babu Sana: ఖరీదైన కారును బహుమతిగా అందుకున్న ఉప్పెన దర్శకుడు.. మొదటి రైడ్ ఎవరితో వెళ్లాడంటే..

Shah Rukh Khan: భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పఠాన్’.. భారీ రెమ్యునరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బాద్షా.. ఎంతంటే

Nagarjuna: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. ప్రపంచ యుద్దం నేపథ్యంలో వెబ్ సిరీస్..

Loading...
Unable to load recommendations.
Follow Us