అమాయకమైన చూపులు.. పక్కకు దువ్విన పాపిడి.. ఈ ఫొటోలోని చిన్నోడు.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గుర్తుపట్టారా.?

|

Jul 30, 2022 | 9:13 AM

స్టార్ హీరోగా రాణించడం అంటే అంత సులువేమీ కాదు. అదికూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అంటే మరింత కష్టం. పైన కనిపిస్తోన్న చిన్నోడు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్.

అమాయకమైన చూపులు.. పక్కకు దువ్విన పాపిడి.. ఈ ఫొటోలోని చిన్నోడు.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గుర్తుపట్టారా.?
Childhood Pic
Follow us on

స్టార్ హీరోగా రాణించడం అంటే అంత సులువేమీ కాదు. అదికూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అంటే మరింత కష్టం. పైన కనిపిస్తోన్న చిన్నోడు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్. ఆయన  సినిమా కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూఉంటారు . ఇంతకీ పై ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అంత కష్టం కాదేమో.. ఇప్పుడు చాలా ఫేమస్ ఆయన. పై ఫొటోలో అమాయకంగా పక్కకు దువ్విన పాపిడి తో కనిపిస్తున్న ఈ స్టార్ ఎవరో గుర్తుపట్టడం చాలా సులువు. ఇప్పటికే చాలా మందికి ఆయన ఎవరో తెలిసిపోయే ఉంటుంది., ఆయన ఎవరంటే..

హీరోగా లేటుగా వచ్చిన సంచలనం సృష్టించాడు.. ఆయన ఎవరో కాదు మక్కల్ సెల్వన్ గా ప్రేక్షకుల చేత మన్నలు అందుకుంటున్న విజయ్ సేతుపతి. మక్కల్ సెల్వన్ అంటే అందరివాడు అని అర్ధం.. నిజంగానే విజయ్ సేతుపతి అందరివాడే.. అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ స్టార్ గా ఎదిగాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సేతుపతి. ఆతర్వాత పిజ్జా సినిమాతో హీరోగా మారాడు. అక్కడి నుంచి విజయ్ సేతుపతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోగానే కాకుండా విలన్ గాను మెప్పిస్తున్నారు విజయ్. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలతో పాటు బాలీవుడ్ లోనూ విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి