
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. కొంతమంది వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె ఒకప్పుడు తెలుగులో ఓవర్ నైట్ సెన్సేషన్. ఒక్క సినిమాతోనే విపరతీమైన క్రేజ్ సంపాదించుకుంది. అందమైన చిరునవ్వు.. అమాయకమైన రూపం.. కట్టిపడేసే నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆమె తెలుగులో చేసింది ఒక్క సినిమానే. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కానీ ఆమె నటించిన ఆ సినిమా.. అందులో ఆమె నటన మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసలలో నిలిచిపోయింది. ఒక్క మూవీతోనే సెన్సేషన్ అయిన ఆమె.. ఆ తర్వాత పూర్తిగా చిత్రాలను పక్కనబెట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ హీరో గోపిచంద్ సరసన సూపర్ హిట్ చిత్రంలో నటించింది. ఆమె పేరు మూన్ బెనర్జీ.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
మూన్ బెనర్జీ.. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ యజ్ఞం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టే్స్తారు. గోపిచంద్ హీరోగా కెరీర్ మలుపు తిప్పిన సినిమా యజ్ఞం. ఇందులో కథానాయికగా నటించి మెప్పించింది మూన్ బెనర్జీ. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. మూన్ బెనర్జీ విషయానికి వస్తే.. కోల్ కత్తాకు చెందిన ఆమె 1997 నుంచి హిందీలో సీరియల్స్ చేస్తున్నారు. మధ్యలో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
అయితే యజ్ఞం తర్వాత ఆమె మరో తెలుగు సినిమా చేయలేదు. ప్రస్తుతం బెంగాలీలో పలు సీరియల్స్ , షోస్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆమెను చూసిన నెటిజన్స్.. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2010లో నీరజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..