చెప్పుకోండి చూద్దాం.! సవాల్ విసిరిన పాన్ ఇండియా స్టార్.. ఈ ఫొటోలో ఎక్కడున్నాడబ్బా..!

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. ఫోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు.

చెప్పుకోండి చూద్దాం.! సవాల్ విసిరిన పాన్ ఇండియా స్టార్.. ఈ ఫొటోలో ఎక్కడున్నాడబ్బా..!
Tollywood

Updated on: Feb 25, 2025 | 11:24 AM

సినిమా ఇండస్ట్రీలో తాను తాను నిరూపించుకుంటూ స్టార్ గా ఎదిగిన హీరో ఆయన.. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్నారు. పైన కనిపిస్తున్న ఫొటోలో ఓ టాలీవుడ్ నటుడు ఉన్నాడు. ఆయనను గుర్తుపట్టగలరా.? అంతమందిలో ఆయన పేరు చెప్పినా కూడా కనిపెట్టడం కష్టమే.. ఆయన ఎవరో మీరు కనిపెట్టారా.? తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అంతే కాదు ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంతా కాదు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? లేడీస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ అయినా.. ఆయన ఎవరో కాదు.

సోషల్ మీడియాలో నటీనటుల ఛైల్డ్ హుడ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం ఎదో ఒక సెలబ్రేటీకు సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో వైరల్ అవుతుంది. ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు జగపతిబాబు.  ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు జగపతిబాబు. ఫ్యామిలీ ఆడియన్స్ లో జగపతి బాబుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇవి కూడా చదవండి

హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు జగపతిబాబు. ఇక హీరోగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన జగపతి బాబు ఆతర్వాత విలన్ గా మారాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా మారాడు ఈ లెజెండ్రీ హీరో. విలన్ గా మారిన తర్వాత జగపతిబాబు ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జగపతిబాబు. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా తన చైల్డ్ హుడ్ ఫోటోను షేర్ చేసిన జగపతిబాబు.. ఆ ఫొటోలో తాను ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.