Tollywood : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఈ బ్యూటీకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది.

|

Jan 18, 2023 | 3:33 PM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు వైరల్ గా మారుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Tollywood : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఈ బ్యూటీకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది.
Actress
Follow us on

ఇటీవల సోషల్ మీడియాలో సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన ఎదో ఒక ఫోటో వైరల్ అవుతూనే ఉంది. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు వైరల్ గా మారుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆ ఫొటోలో డీ గ్లామర్ తో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఇటీవల కాలంలో హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. నటన కోసం ఎలాంటి పాత్రలైనా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఆన్సర్ తెలిస్తే షాక్ అవుతారు.. ఈ అమ్మడా అని ఆశ్చర్యపోతారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు.. ఇటీవల చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించిన లవ్ టుడే హీరోయిన్ ఇవానా.. ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఇవానా అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చూడముచ్చటైన ఈ అమ్మడి రూపం కుర్రాళ్లను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ గూగుల్ ను గాలించేస్తున్నారు కుర్రకారు. ఇవానా అసలు పేరు అలీనా షాజీ. అయితే ఈ పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా మార్చుకుంది. పై ఫోటో ఇవానా నటించిన నాచియార్ అనే సినిమాలోది.. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో జోతిక ప్రధాన పాత్రలో నటించగా ఇవానా సహాయక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు లవ్ టుడే సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.