Nuvvostanante Nenoddantana: వాసి వాడి తస్సాదియ్యా.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తోన్న నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్యూటీ.. ఇప్పుడెలా ఉందంటే

| Edited By: Ravi Kiran

Nov 11, 2024 | 7:25 AM

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొందరు మాత్రం సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించి చాలా ఫేమస్ అయిపోతుంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సిద్ధార్థ్ ను విపరీతంగా ప్రేమించేసింది. తనే నందిత జెన్నిఫర్.

Nuvvostanante Nenoddantana: వాసి వాడి తస్సాదియ్యా.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తోన్న నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్యూటీ.. ఇప్పుడెలా ఉందంటే
Actress News
Follow us on

ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదనుకోండి. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటిసారి దర్శకుడిగా మారి రూపొందించిన ఈ అందమైన ప్రేమకథ చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ పేరు చెబితే ఇప్పటికీ జనాలకు సిద్ధార్థ్, త్రిష అందమైన జోడి గుర్తుకు వస్తుంది. ఇందులో సిద్ధార్థ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే ఇందులో త్రిష అన్నయ్య పాత్రలో నటుడు శ్రీహరి అద్భుతంగా నటించారు. 2005లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలోని అన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అంతేకాకుండా తెలుగులోనే సూపర్ హిట్ అయిన ఈ సినిమాను అత్యధిక భాషల్లో రీమేక్ చేశారు. అలా సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ మూవీ. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు రీమేక్ చేశారు మేకర్స్. ఈ మూవీలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకం. ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ తమదైన నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాలో వీరితో పాటు చాలా మంది నటించి అడియన్స్ మససు గెలుచుకున్నారు. ముఖ్యంగా ఈసినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది నందిత జెన్నిఫర్.

ఇవి కూడా చదవండి

ఈ మూవీలో సిద్దార్థ్ ను ఇష్టపడే అమ్మాయిగా అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశపడే అమ్మాయిగా కనిపించింది నందిత జెన్నిఫర్. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అలాగే చివరి మూవీ కూడా. నువ్వొస్తానంటే నేనోద్దంటానా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన నందిత.. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అలాగే బుల్లితెరపై పలు టీవీ షోలలో పాల్గొంది. 2007లో కాశీవిశ్వనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నందిత. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం నందిత జెన్నిఫర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడును చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.